పోలీస్ స్టేషన్ల వారిగా పాసుల జారీ అదనపు ఎస్పీ శ్రీమతి నర్మదా

0
417
  1. Telangana
    పోలీస్ స్టేషన్ల వారీగా పాసులు జారీ          అదనపు ఎస్పీ శ్రీమతి నర్మదా                                          నల్లగొండ.

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసర సేవలు, నిత్యావసరాలు తీసుకు వచ్చే వాహనాలు, మరియు మెడికల్ వ్యవసాయ సంబంధిత వాహనాలకు ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా పాసులు జారీ చేస్తున్నామని అదనపు ఎస్పీ శ్రీమతి శ్రీ నర్మదా తెలిపినారు. జిల్లా పలు ప్రాంతాల నుండి పాసుల కోసం జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తున్నారని పాసుల కోసం నల్గొండ వరకు ఎవరు రావొద్దని ఆమె సూచించారు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సంబంధిత అధికారులు పాసులు జారీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు వరి కోత మిషన్లు ట్రాక్టర్లు వ్యవసాయ సంబంధిత వాహనాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులు పరిశీలించి పాసులు జారీ చేస్తారని ఆమె వివరించారు కరోనా వైరస్ వ్యాధి నియంత్రణ వ్యాప్తి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పాసుల కోసం జిల్లాలోని దూర ప్రాంతాల ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయం వరకు వచ్చి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు డిఎస్పి స్థాయిలో పాసులు జారీ చేసే విధంగా ఏర్పాటు చేసామని ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని అదనపు ఎస్పీ నర్మద తెలిపారు .

ఎండి షఫీ
మిర్యాలగూడ రిపోర్టర్
ఎన్ ఏ సి న్యూస్ చానల్.