ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది : భాజపా రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్

0
260

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నదిగడ్డ తండాలో NYK ట్రైనర్ (TOT) కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్వామి వివేకానంద సేవసమితి గౌరవ అధ్యక్షులు ( బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) జ్ఞానేంద్ర ప్రసాద్ గారు విచ్చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రకృతి తాపనికి ఎవరు కూడా భరించలేరని అందుకే ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అన్నారు. సమజాహితం కోరుకునే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు..దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చడానికి మనమంతా ప్లాస్టిక్ తరిమికొడదం అన్నారు..పూర్వం భారతదేశం అటవీ సంపదతో నిండి అనేక రకాల వనములికలు కలిగి ఉండేవి అన్నారు. అలాంటిది అటవీ సంపద అంత తరిగిపోయింది అన్నారు..అందుకే చెట్లను నాటి అడవులను పెంచి పూర్వ వైభవం తీసుకొద్దాం అన్నారు..ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కన్నా బిడ్డల్లా కాపాడుకుందాం..భూతపన్ని తగ్గించి పుడమితల్లి ఎదలనిండా పచ్చదనంతో నింపుదాం..ప్రపంచ పర్యావరణాన్ని రక్షించుకుందాం అన్నారు….ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు మనిక్ రావు, బీజేపీ వివేకానంద సేవ సమితి యువజన నాయకులు చందు, రత్నాకర్,రాఘవేంద్ర,రాజేశ్వర్,సందీప్, నవీన్, కళ్యాణ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here