ప్రజలు శుభ్రతను పాటించాలి: సర్పంచ్ బాలాజీ నర్సిములు.

0
260

Serilingampally June 05: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు శుభ్రతను పాటించాలని శంషోద్దీన్ పూర్ గ్రామ సర్పంచ్ బాలాజీ నర్సిములు అన్నారు. గురువారం మండల పరిధిలో శంషోద్దీన్ పూర్ గ్రామంలో పల్లె ప్రగతి పారిశుధ్యం కార్యక్రమం లో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించారు. రోడ్డు శుభ్ర పర్చారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బాలాజీ నర్సిములు మాట్లాడుతూ గ్రామంలో అన్ని వీధిల్లో, ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పరిశీలించారు. మురికి కాల్వలను శుభ్రపర్చారు. దోమలు, ఈగలు ప్రబలకుండా ఉండేందుకు కెమికల్స్ బాల్స్ ని, కందకం వాగులో వదిలారు. కిందికి వేలాడే విద్యుత్ తీగలు దారికి ఇబ్బందిగా ఉన్న విద్యుత్ స్తంభాలు గమనించిన సర్పంచ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరమ్మత్తులు చేయాలని ఆధికారులను కోరారు. నీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పైప్ లైన్ రిపేరింగ్ వర్క్, డ్రైనేజీ క్లినిక్ నేటి నుంచి ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో సొసైటీ డైరెక్టర్ సుభాష్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, పారిశుధ్య కార్మికులు రవి, విట్ఠల్, గ్రామ మహిళలు,యువకులు,ప్రజలు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here