ప్రజారోగ్య పరిరక్షణకు పట్టణ ప్రగతి దోహదం:రాగం నాగేందర్ యాదవ్ కార్పోరేటర్

0
309

ప్రజారోగ్య పరిరక్షణకు పట్టణ ప్రగతి దోహదం
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎంతగానో పాటుపడుతున్నారని అందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి – పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆరవ రోజైన శనివారం నాడు మజీద్ బండ – కొండాపూర్ కు వెళ్లే ప్రధాన రహదారి, హనుమాన్ దేవాలయం ఆవరణలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేపట్టారు. రోడ్డుకిరువైపులా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి మురికి కాలువల్లో పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా రోడ్లు, కాలనీలు పరిశుభ్రమవుతున్నాయని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. సీజనల్ వ్యాదులు ప్రభలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ ‌డివిజ‌న్ గౌరవ అధ్యక్షుడు ‌దుర్గం వీరేశం గౌడ్, అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, ఉపాధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్, పద్మారావు, వార్డు మెంబర్ కొడిచర్ల రాము, నాయకులు మేడ్చల్ విజయ్, కెఎన్ రాములు, సంగమేష్, డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్, వర్క్ ఇన్ స్పెక్టర్లు మహేష్, యాదగిరి, ఎస్ ఆర్ పీ కృష్ణ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here