ప్రతి ఆదివారం – పది గంటలకు – పదినిమిషాలు – పది వారాలు: శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు కార్పొరేటర్ హమీద్ పటేల్ చర్యలు

0
264

శేరిలింగంపల్లి, మే 17 : మన మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం – పది గంటలకు – పదినిమిషాలు – పది వారాల పాటు దోమల ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని రెండవ ఆదివారం అయిన ఈ రోజున జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు డోయేన్స్ కాలనీలోని తన స్వగృహంలో ఇంట్లో, పెరట్లో, బాల్కనీలో ఎక్కడ కూడా నీరు నిలిచి ఉండకుండా,చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విధిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం – పది గంటలకు – పదినిమిషాలు – పది వారాల పాటు తమ తమ ఇంటి వద్ద పాల్గొని, మిగిలిన వారందరికీ అవగాహన కల్పించి, నీరు నిలిచే పరిసర ప్రాంతలలో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేశారు.

ఎన్ నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here