ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పకుండా ధరించాలి: రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్.

0
184

శేరిలింగంపల్లి, మే 8: ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని, కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నెహ్రూ నగర్ లో నివసిస్తున్న దినసరి, నెలసరి కూలీలకు, పేద ప్రజలకు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి బియ్యం, నిత్యావసర సరుకులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వంత ఖర్చులతో పంపిణీ చేశారు. లాక్ డౌన్ ఈ నెల 29వరకు పొడగించిన నేపథ్యంలో నిత్యావసర సరుకులు కొనలేని పేదలను దృష్టిలో పెట్టుకు‌ని ఈ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనవసరంగా బయట తిరగకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, కే ఎన్ రాములు, టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, మహేందర్ సింగ్, సలీం, రవీందర్ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here