బియ్యం పంపిణీ చేసిన జగదీశ్వర్ గౌడ్:రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా 12కిలోల బియ్యం.

0
125

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న ప్రతి లబ్ధిదారులకు 12కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది..                                శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

కరోనా వైరస్ వల్ల ఎంతో మందికి తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు  పడుతున్నారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న లబ్ధిదారులకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కూడా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ నందు రేషన్ కేంద్రాలను సందర్శించి,ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందించి,రేషన్ కేంద్రాల వద్ద ప్రజలకు సామాజిక దూరం పాటించాలని,రేషన్ తీసుకున్న వెంటనే ఇంట్లోకి వెళ్లేముందు చేతులు శుభ్రంగా కడుకోవాలని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు..అనంతరం బస్తీలో నివాసముందే ఇతర రాష్ట్రాల ప్రజలతో మాట్లాడి,వారికి రోజు జి.హెచ్.ఎం.సి తరపున బోజనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు..కార్పొరేటర్ వెంట వార్డ్ మెంబెర్ రహీం,ఆదిత్య నగర్ బస్తి మరియు టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ఖాసింమ్,టిఆర్ఎస్ నాయకులు మునఫ్ ఖాన్ ఉన్నారు..

Telangana State                                        Nalla Sanjeeva Reddy, Bureau Chief            South India,NAC NEWSCHANNEL