బొబ్బం నవత రెడ్డి చందానగర్ కార్పొరేటర్: డివిజన్లోని సుమారు 8000 వేల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ..
కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
‘కరోనా’ లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని పేదలు ఆకలితో అలమటించకుండ ఉండేందుకే ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారని ఇందులో భాగంగానే చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ రేషన్ షాప్ లో ఈరోజు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కార్పొరేటర్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో సుమారు 8 వేల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున,కుటుంభంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇద్దరు ఉంటే 24 కిలోలు,నలుగురు ఉంటే 48 కిలోలు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాప్‌కు వచ్చే వారు ప్రతి ఒక్కరు కనీసం 1 మీటర్ దూరం పాటించి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళాలని, ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని,రేషన్ షాప్‌కి వచ్చేవారు క్యూ పద్ధతిలో దూరం పాటించి రేషన్ సరుకులు తీసుకువెళ్లాలని చెప్పటం జరిగినది.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,ఎన్ ఏ సి న్యూస్ చానల్.