శేరిలింగంపల్లి, కొండాపూర్ : అంజయ్య నగర్ లోని సగర ఉప్పర సంఘము వారు, భువి నుంచి దివికి గంగమ్మను దించిన మహర్షి భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించుట జరిగింది. ఈ సందర్బంగా సగర ఉప్పర సంఘము వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుట జరిగింది. అందులో భాగంగా నేటి కరోనా వ్యాప్తి లాక్ డౌన్ దృష్ట్యా రక్తం కొరతను గుర్తించి, ఆ రక్త కొరత తీర్చటంలో భాగంగా బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయుట జరిగింది. ఈ సందర్బంగా యువత స్వచ్చందంగా రక్తదానం చేయటానికి ముందుకు వచ్చారు. అలాగే 150 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో బాటుగా బియ్యం పంపిణీ చెయ్యుట జరిగింది.
ఈ విశిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ & శాసన సభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ గారు, జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ గారు, ఎమ్యెల్యే గారు, కార్పొరేటర్ గారు మాట్లాడుతూ…
ఘోర తపస్సు చేసి మానవాళి మనుగడకు, శ్రేయస్సుకు, ఆ గంగమ్మను భువి నుంచి దివికి రప్పించిన మహర్షి, మహనీయుడు భగీరధుడని, ఆ తపస్విని స్మరించుకొని ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చెయ్యటం సంతోషించవల్సిన విషయమని పేర్కొన్నారు. సగర ఉప్పర సంఘము వారు చాలా గొప్పగా ఏర్పాట్లు చేసారని, ఎప్పుడు సేవా కార్యక్రమాలకు ముందు ఉండి నడిపిస్తారని, ఇలానే వారి సేవా కార్యక్రమాలను కొనసాగాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో వారితో బాటుగా సగర ఉప్పర రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ శేఖర్ సాగర్, స్టేట్ జనరల్ సెక్రటరీ సత్యం సాగర్, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ జీ. సత్యనారాయణ సాగర్, అంజయ్య నగర్ సంఘం ప్రెసిడెంట్ బాల స్వామి సాగర్, జనరల్ సెక్రటరీ రవి సాగర్, కోశాధికారి రాజు సాగర్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, వార్డు మెంబర్ నరసింహ సాగర్, కే శ్రీను సాగర్, ఎమ్ రవి సాగర్, రవి శంకర్ నాయక్, క్రిష్టయ్య సాగర్, సాయి బాబా, సురేష్ సాగర్, నారాయణ సాగర్, పెరుక రమేష్ యూత్ నాయకులు దీపక్ తదితరులు పాల్గొన్నారు.
Nalla Sanjeeva Reddy
Telangana
Bureau Chief
Incharge South India
NAC NEWS CHANNEL.
