భగీరథ మహర్షి జన్మదినం సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ గారు, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు.

0
120

తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం గచ్చిబౌలి అంజయ్య నగర్ సగర సంఘం కార్యాలయం లో రక్త దాన శిబిరాన్ని సందర్శించిన రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… లోక కల్యాణం కోసం ఆనాడు శ్రీ భగీరథ మహర్షి కఠోర తపస్సు చేసి పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువస్తే ఈ నాడు సగరులు రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని అన్నారు. సగరులు ఈ సమాజానికి హితం చేసే పనులు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ ఫలాలు అందిస్తుందని తెలియజేశారు. భవిష్యత్ లో సగరులకు ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, లింగోజీగూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు, సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సాగర్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దబూది సతీష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డపార సత్యనారాయణ సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు బాలస్వామి సగర, నాయకులు నర్సింహ్మ సగర, శ్రీనివాస్ సాగర్, జి. రవి సగర, రాజు సగర, రాష్ట్ర సగర సంఘం నాయకులు దామోదర్ సగర, యువజన సంఘం నాయకులు మహేందర్ సగర, సాయిగణేష్ సగర, జగద్గిరిగుట్ట సంఘం అధ్యక్షులు గంగాధర్ సగర తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
ఇంచార్జి సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.