మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారు మరియు మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వ రోజు గచ్చిబౌలి డివిజన్

0
184

గౌరవ ప్రభుత్వ విప్, శాసన సభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ గారితో కలిసి గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు డివిజన్లో పాదయాత్ర చేయడం జరిగింది.

ఈ సందర్భంగా… రోడ్లపై మట్టి కుప్పలు, ఖాళీ ప్రదేశాలలో చెత్తను, పొదలను, పనికి రాని అటవీ సంబంధిత మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ సిబ్బందితో చేయించారు మరియు మార్కెట్లు, స్కూల్స్ పరిసరాలు, హాస్పిటల్స్, హోటల్స్, షాపులు, హాస్టల్స్ ఎక్కడ కూడా చెత్త వెయ్యకుండా ప్రజలలో అవగాహనా కల్పించి, జీహెచ్ఎంసి స్వచ్ ఆటోలలో మాత్రమే చెత్తను వెయ్యాలని స్థానిక నివాసులకు చైతన్య పరిచారు. ఓపెన్ ప్లాట్స్ లో ఎక్కడ కూడా చెత్త వెయ్యకుండా చూడటం, లేకుండా చూడటం, ఒకవేళ ఎవరైనా చెత్త బహిరంగ ప్రదేశాలలో వేస్తే వారికీ జరిమానా విధించే విధంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే గారు మరియు స్థానిక కార్పొరేటర్ గారు ప్రజలకు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీసీ వెంకన్న గారు, ఏఈ కృష్ణవేణి గారు, జిహెచ్ఎంసి సిబ్బంది, సానిటైజేషన్ సిబ్బంది, డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మహిళా అధ్యక్షురాలు రామేశ్వరమ్మ, డివిజన్ వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here