మన ప్రజల ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి……..

0
440

అందరికీ నమస్కారం

ఇదేనా మన సంస్కారం ??
ఇదేనా మన క్రమశిక్షణ ??
కనీస ఇంగిత జ్ఞానం కూడా మనకు లేదు…??

మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాననీయ శ్రీ కెసిఆర్ గారు … కరోనా వైరస్ మహమ్మారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గురి కావొద్దని… ఎంతో ముందు చూపుతో లాక్ డౌన్,కర్ఫ్యూ ప్రకటించారు… …….మన అందరి ఆరోగ్యం బాగుండాలని… తెలంగాణ మొత్తం ఇంటికి పరిమితమై స్వీయ నియంత్రణ పాటిద్దాం అని పిలుపునిచ్చారు …!!

కానీ ఈరోజు నేను గమనించిన విషయం ఏమిటంటే కరోనా మహమ్మారి విజృంభించకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ అవుట్ ప్రకటిస్తే కనీసం పట్టించుకోకుండా రోడ్లపై జనాలు సంచరిస్తున్నారు…!!

సూపర్ మార్కెట్ల వద్ద,.. రైతు బజార్ల వద్ద .., నిత్యావసర కొనుగోళ్ల వద్ద … జనాల రద్దీ ఎక్కువగా ఉంది…. !!

ఇంకా కొన్ని ప్రాంతాల్లో షోరూం లు.. మెకానిక్ షెడ్లు.. ఇతర వ్యాపార కేంద్రాలు తెరిచి ఉండడం చాలా బాధాకరం …!!

ఈరోజు మీ నిర్ల్యక్ష్యం మీ కుటుంబాన్ని మాత్రమే కాదు… సమాజం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టబోతోంది… దయచేసి మనం అందరం ఇంటికి పరిమితమై స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా రాకాసి కట్టడిలో ఉంటుందని గుర్తించండి. …!!

స్థానికులు కాలనీ అసోసియేషన్లు బాధ్యతగా వ్యవహరించి ఇతర దేశాల నుండి వచ్చిన వారి వివరాలను 104 నంబరులు కానీ సంబంధిత డిప్యూటీ కమిషనర్ కి వెంటనే తెలియజేయండి…!!

కొత్తగా వేరే ప్రాంతాలనుండి వచ్చిన వారు వైద్యులు పరిశీలించిన అనంతరం పాటించాల్సిన నియమాలను పాటించనచో కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సిన విషయాన్నీ కూడా తెలియపరచాల్సిందిగా కోరుచున్నాను.!!!

ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సహాయం కోసం 104 నంబర్ కి కాల్ చేసి సమాచారం *అందించాలని మనవి !!!

 

మీ …
NALLA SANJEEVAREDDY
NACOCI
NATIONAL COORDINATOR…
SOUTH INDIA
9866318658
9849396606

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here