జహీరాబాద్ పురపాలక సంఘం : మహీంద్రా కాలనీ, పస్తాపూర్ కాలనీలలో పారిశుద్ధ్య కార్యక్రమం మరియు సమస్యలపై పాదయాత్ర చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు.

0
217

జహీరాబాద్ పురపాలక సంఘం సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమం
రెండవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన
జహీరాబాద్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు మన ఇంటి మాదిరిగా ప్రతీ గల్లీని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారు చెప్పారు. సోమవారం ఉదయం పస్తాపూర్,మహింద్రా కాలనీల్లో పాదయాత్ర చేపట్టారు.
కాలనీ వాసులతో మాట్లాడి అక్కడి స్థానిక సమస్యలపై ఆరా తీస్తూనే.
ఇంటి గృహిణీలతో మంచి నీటి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
మురికి కలువాలు ఎన్ని రోజులకు లు ఒకసారి తీయిస్తున్నారని,
మిని వాటర్ ట్యాంక్ ను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రపరుస్తున్నారని, అడిగి తెలుసుకున్నారు,
అలాగే వాటర్ ట్యాంక్ చుట్టూ నీరు నిల్వ ఉంచకుడాదని,
అలాగే ఇళ్ల పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మున్సిపల్ కమిషనర్ గారికి చేప్పారు.
జహీరాబాద్ మున్సిపాలిటీలొ
మొదటి విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులు ఏ స్తాయిలొ ఉన్నాయో మున్సిపాలిటీ అధికారులకు అడగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ శివకుమార్,
మాజీ మున్సిపల్ చైర్మన్లు,మాజీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here