మాధాపూర్/హఫీజ్పేట్ డివిజన్స్:వివిధ ప్రాంతాల్లో దాతల సహకారంతో నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
161

సామాజిక బాధ్యతగా పిలుపునిచ్చిన నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువుల అందించడం చాలా సంతోషంగా ఉంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.దీంతో,ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇళ్లలో మగ్గుతున్న పేద కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా సామాజిక బాధ్యతగా కార్పొరేటర్ గారు పిలుపునిచ్చిన నేపద్యంలో…

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నివాసముండే గోపి నగర్ శ్రీ.సత్యనారాయణ గౌడ్ గారు రూ.22వేలు మరియు ఖానమేట్ టిఆర్ఎస్ నాయకులు శ్రీ.కృష్ణ గౌడ్ వారి మిత్రులు రూ.55వేలు రూపాయలను నిరుపేద కుటుంబాలకు అందించాలనే ఉదేశంతో కార్పొరేటర్ గారిని సంప్రదించి వారికి అందించారు,దాతల వెంట వీరేశం గౌడ్,నయిమ్ ఉన్నారు..
అనంతరం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు తనవంతుగా 10కింటల్లా బియ్యాన్ని వాటితో పాటు జతపరిచి మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ,ఓల్డ్ హఫీజ్ పెట్,భిక్షపతి నగర్,ఆదిత్య నగర్ నందు కార్పొరేటర్ గారిని స్థానికులు సంప్రదించిన నేపథ్యంలో నిరుపేద 200కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను అందించారు..

అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్-1 నందు అసోసియేషన్ సభ్యులు సుమారు 250మంది వలస కూలీలకు,గుడిశెలో నివాసముండే ప్రజలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు,ఈ అన్నదానం నిత్యం జరుగుతుందని తెలిపారు.

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే సరుకులను కూడా రేషన్ కార్డ్ ఉన్నవారందరికి అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు…మానవతా దృక్పథంతో ఎంతో మంది నిరుపేద ప్రజలుకు సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని,ఒకరికొకరు సామాజిక దూరంతో ఉండాలని,అవసరం ఉంటే తప్ప బయటకి రావ్వొద్దని,పార్టీలకు అతీతంగా ప్రజలు ఏదైనా పేద ప్రజలకు అందించాలంటే వారు కూడా చేతికి గ్లవ్సులు,మూతికి మాస్కులు పెట్టుకోవాలని కోరారు..ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కె.వెంకటేష్ గౌడ్,మల్లేష్,ఆదిత్య నగర్ బస్తి మరియు టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ఖాసీం,యూత్ అధ్యక్షులు ఖాజా,మస్జిద్ల సాధర్ లియకత్,ఆర్షద్,మూస.
జనప్రియ నగర్ సభ్యులు.
శాంతయ్య,ఉమామహేశ్వరరావు,శివ,ఈ.వి.మూర్తి,రవి,ఎం.శ్రీనివాస్,మల్లికార్జున,భిక్షపతి గౌడ్,అపల్ నాయుడు,సురేష్,ఉమేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.