శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు&వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ మరియు ఎన్ఆర్ఐ రవి వారి బృందం సహకారంతో 350మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు పాల్గొని పేదలకు అందించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగుల్ గౌడ్, మణిక్ రావు,చెందు,దశరద్, ఆంజనేయులు, సీతారాం, రత్నాకర్, రాజ్ జాస్వాల్, రాఘవేంద్ర,సందీప్,వివేకానంద సేవ సమితి సభ్యులు నాయకులు, కార్యకర్తలు తదితరులు సహకరించారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.