ముంపు బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

0
278

ముంపు బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తక్షణ సహాయం రూ. 10 వేల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నాల్గో రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మసీద్ బండ వడ్డెర బస్తీ, తారానగర్, నెహ్రూనగర్, గోపీనగర్ లో కొనసాగింది. ముంపు బాధితులకు కేసీఆర్ అందజేసిన నగదు సహాయం తో వారిలో మనోధైర్యం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులను ఆదుకునేందుకు అందజేస్తున్న రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ సార్ ఒక పెద్దన్నలా బతుకమ్మ, దసరా పండగకు ముందు ఈ ఆర్థిక సహాయం చేయడం పట్ల వర్షం ముంపు‌ బాధితుల కళ్లలో ఆనందం కనబడుతుందని అన్నారు. ఆయన వెంట డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ సత్యరాజ్, టౌన్ ప్లానింగ్ విభాగం సెక్షన్ అఫీసర్ విశాల్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ఉపాధ్యక్షులు యాదాగౌడ్, పద్మారావు, వార్డు మెంబర్లు కవిత, ఫర్వీన్, పార్టీ నాయకులు కెఎన్ రాములు, ఆంజనేయులు,‌ శ్రీకాంత్, గోపాల్, మల్కయ్య, గఫర్,
పవన్, కిరణ్, మహేష్, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here