మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కెటిఆర్ గారిని కలిసి మాధాపూర్, హఫీజ్పేట్ డివిజన్ ల అభివృద్ధి పనులకు సంబంధించిన వినతి పత్రం అందజేసిన కార్పోరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్.

0
328

తెలంగాణ రాష్ట్ర గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారిని కలిసి డివిజన్ అభివృద్ధి పనులపై వినతిపత్రాన్ని అందించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్క ప్రణాళికతో ముందుకు సాగుతూ,తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అనేక రంగాల్లో ముందుండి ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారికే దక్కుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

గురువారం గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారిని కలిసి మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకై వినతిపత్రాన్ని అందించారు..

కార్పొరేటర్ గారు అందించిన వాటికి సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు వెంటనే సంబంధిత అధికారులకు మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్న పనులను పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు..
మంత్రి గారికి కార్పొరేటర్ గారు అందించిన వినతిపత్రం..
మాదాపూర్ డివిజన్..

ఆదిత్య నగర్ పెండింగులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ మరియు సీసీ రోడ్డు పనులు,గోకుల్ ప్లాట్స్ మరియు అయ్యప్ప సొసైటీ నందు నూతన సీసీ రోడ్లు మరియు యూ.జి.డి ఔట్లెట్ పనులు,కృష్ణ కాలనీ,సుభాష్ నగర్,నవభారత్ నగర్,కనమేట్,ఇజత్ నగర్,భిక్షపతి నగర్,చంద్ర నాయక్ తండా,మాధవ నగర్,రాజారామ్ కాలనీ నందు యూ.జి.డి మరియు సీసీ రోడ్లు,మరియు గుట్టల బేగంపేట,సైబర్ వ్యాలీ,విలేజ్,కృష్ణ కాలనీ,దోబీ ఘాట్ కాలనీలో డ్రైనేజ శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు..

హఫీజ్ పెట్ డివిజన్.
గంగారాం,ఆర్.టి.సి కాలనీ,శాంతి నగర్,హుడా కాలనీ నందు యూ.జి.డి,సీసీ రోడ్లు,ఇంజినీరింగ్ ఎనక్లేవ్,సుభాష్ నగర్ నందు నూతన రోడ్లు,మైత్రి నగర్, మదినగూడా,రామకృష్ణ నగర్,అల్విన్ కాలనీ,ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామం,ప్రజయ సిటీ,జనప్రియ,యూత్ కాలనీ,సాయి నగర్,ప్రకాష్ నగర్,వైశాలి నగర్ నందు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ మరియు సీసీ రోడ్లు ముఖ్యంగా వినాయక్ నగర్,ఎల్లమ్మ బస్తి,గెజిట్టేడ్ ఆఫీసర్స్ కాలనీ,వైశాలి నగర్ నుంచి వెళ్తున్న ఓపెన్ నాలాకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు..

హఫీజ్ పెట్,మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక కాలనీ,బస్తీలో నూతన పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here