మేడే సందర్భంగా లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ, నిత్యావసరాల వస్తువులను సమకూర్చిన మలబార్ గ్రూప్ వారికి అభినందనలు: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
186

చందానగర్ డివిజన్ PJR స్టేడియం లో ఈరోజు మేడే సందర్భంగా లాక్ డౌన్ లో పనిచేస్తున్న GHMC ఎంటమొలజీ సిబ్బందికి, స్టేడియం లో పనిచేసే సిబ్బందికి, శానిటేషన్ SFA లకు, HMWSSB సభ్యులకు, అంగన్వాడి టీచర్లకు, CRP లకు, హెల్త్ అసిస్టెంట్లు చందానగర్ డివిజన్ లో పని చేస్తున్న కార్మికులకు సుమారు 150 మందికి మలబార్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో పంచదార, కిలో నూనె, కిలో గోధుమపిండి, అర కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కేజీ మిర్చి పౌడర్ మొదలగు నిత్యవసర వస్తువులను సుమారు 800 రూపాయల ఖరీదు గల వస్తువులను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ గారు, యువభారత్ జిల్లా అధ్యక్షుడు పుట్ట వినయ్ కుమార్ గౌడ్ గారు, మరియు చందానగర్ మలబార్ స్టోర్ ఇంచార్జి దీపక్ గార్లతో కలిసి కార్మికులకు నిత్యావసరాల వస్తువుల పంపిణీ చేసి కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.