50 నెలల గౌరవ వేతనాన్ని మొత్తం 300000/- లక్షల రూపాయలు మరియు 200000/- లక్షల రూపాయలు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తం 500000/- లక్షల రూపాయలను సి.ఎం రిలీఫ్ ఫండ్(CMRF)కు గౌరవ మంత్రి వర్యులు శ్రీ KTR గారి ద్వారా, అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కోవిడ్ – 19 బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి అండగా నిలబడదాం.
కోవిడ్ – 19 తో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వo పిలుపు మేరకు, కెసిఆర్ గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి ఆదరణతో,MLA గాంధీ గారు మరియు మేయర్ బొంతు రామ్మోహన్ గారి సూచనల మేరకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన పార్టీకి మరియు ప్రజల దీవెనలతో కార్పోరేటర్ గా గెలిచి నాలుగు సంవత్సరాల రెండు నెలలు అనగా ( 50 నెలలు) నెలకు 6 వేల గౌరవ వేతనo నేను పొందడం జరిగినది. ప్రస్తుతం కరోనా వైరస్ మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా, నా వంతు సహాయం గా ప్రభుత్యానికి అండగా నిలవాలని 50 నెలల గౌరవ వేతనం 6000×50 నెలలు=300000 లక్షల రూపాయలు మరియు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 200000 లక్షల రూపాయలను మొత్తం కలిపి 500000 లక్షల రూపాయలను ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు గౌరవనీయులు మినిస్టర్ KTR గారి ద్వారా, మేయర్ బొంతు రామ్మోహన్ గారి సమక్షం లో అందచేయటం జరిగినది. ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో కోవిడ్ – 19 బాధితులను ఆదుకోవడానికి నా వంతు బాధ్యతగా నేను చేసిన ఈ చిన్న సహాయాన్ని చిరునవ్వుతో స్వీకరించి భుజం తట్టి అభినందించిన నా అభిమాన నాయకుడు KTR గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
కష్ట కాలంలో ప్రభుత్యానికి మరియు మనలను ఆదరించిన ప్రజలకు మనo అందరం చేయూతనివ్వవల్సిన అవసరం ఎంతయినా ఉందని, మనమందరం ప్రభుత్య సూచనమేరకు కోవిడ్ -19 ను ఎదుర్కొని విజయం సాధిస్తాం అని ఆశిస్తూ మీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.
