యంపి అయ్యి సంవత్సరకాలం పూర్తి అయిన సందర్భంగా ప్రగతి నివేదనతో ప్రజల ముందుకు వచ్చిన డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు.

0
215

శేరిలింగంపల్లి, మే 23: డాక్టర్ రంజిత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు.

ప్రధాని మోడీ ఫ్యూడల్ గా వ్యవరిస్తున్నారు…
కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు చేస్తున్నారు…
నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారు…
పార్లమెంట్ లో నిలదీస్తాం…
బీజేపీ ఎంపీ లు ముందు రాష్ట్రానికి తేవాల్సిన నిధుల గురించి ఆలోచించండి, రాజకీయాలు కాదు…

ఎంపీ అయ్యి ఒక సంత్సరకాలం పూర్తి అయ్యిన సందర్భంగా ప్రగతి నివేదన తో ప్రజల ముందుకు వచ్చిన ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి.

ప్రజాసేవ చేస ఒక గొప్ప అవకాశం, అది నాకు దక్కడం అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కెసిఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఫెడరల్ టైప్ గవర్నమెంట్ కావాలి అని గుజరాత్ సీఎం గారు ఇప్పుడు ప్రధాన మంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు.

వైద్య విద్య ఉపాధి లేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం లాక్ డౌన్ వాయిదా వేశారు. అదే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదు. వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు.

కొవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు. హెలికాప్టర్ మినీ అని కెసిఆర్ గారు చెప్తే చెయ్యలేదు. మోడీ గారు ఇన్ని సార్లు విడియో కాన్ఫరెన్స్ పెట్టీ మాట్లాడుతున్నారు. కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు.

FRBM లోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదు.
6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు.

వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ను నిలదీస్తాం.

అరవింద్ ముందు రాష్ట్రం అభివృద్ది గురించి మాట్లాడు. రాష్ట్రానికి కేంద్రం నుండి తెచ్చే నిధులు గురించి కొట్లాడు.
ఒక సంవత్సరం నుండి ఇచ్చిన హామీలు ఎటు పోయాయి. ఒక్కటన్న నెరవేర్చారా ?
కేంద్రం నుండి తీసుకు వచ్చే నిధులు తీసుకురండి. అవి పక్కన పెట్టీ అభివృద్ది చేస్తున్న రాష్ట్రం మీద విమర్శలు చేయడం తగునా?

అభివృద్ది అందుబాటు అనే నినాదం తో ప్రజల ముందుకు వచ్చాను. అదే కొనసాగిస్తున్నాను.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి., నియోజక వర్గ ఎమ్మెల్యేలు అందరూ పూర్తి స్థాయిలో సహకరించారు.

మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో రాష్ట్ర అభివృద్ది కోసం పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ నీ వినిపిస్తున్న.

కెసిఆర్ గారు ప్రగతి నివేదన సభ పెట్టి ప్రభుత్వం చేసిన పని చెప్పారు. అదే విధంగా ఈ సంవత్సరం పాటు ఎం చేశామో ప్రజల ముందుంచుతున్నాను.

జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ లోకి సీఎం గారు మార్చారు.

పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము.

ఎంఎంటీఎస్ ను వికారాబాద్ కు ఎక్స్టెన్షన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.

ఫార్మా సిటీ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించాను.

ఐటీ విస్తృతికి కృషి చేస్తున్నాం. అమెజాన్ డాటా సెంటర్ ను తీసుకొని వచ్చాము. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాం.

నా తపన, ఆరాటం చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ది. చేయాల్సింది చాలా ఉంది. బిజినెస్ కంటే ప్రజాసేవలో సంతోషం ఎక్కువ ఉంది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here