రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్:బాపూనగర్లో రేషన్ కార్డు లేని పేదలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ .

0
295

శేరిలింగంపల్లి nac: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపు నగర్ లో రేషన్ కార్డు లేని పేదలకు, కూలీలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బియ్యం, నూనె, పప్పు తో పాటు నిత్యావసర వస్తువుల ను శనివారం అందజేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు కరోనా నివారణకై భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, రవీందర్, తిరుమల చారి, మహేందర్, రాజు, కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్,బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here