రాబోయే వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధుల నివారణ కోసం దోమలను తరిమికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
362

శేరిలింగంపల్లి, మే 10: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు 10 వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు తమ ఇళ్లలో దోమలను తరిమికొట్టే కార్యక్రమానికి చందానగర్ డివిజన్ తన ఇంటి పరిసరాలు, గార్డెనింగ్,‌ తదితర ప్రాంతంలో ఎక్కడా నీరు నిల్వలేకుండా చేసి దోమల మందు పిచికారి చేశారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ… కేటీఆర్ గారి పిలుపు మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా ఇళ్లలోని కూలర్లు, టైర్లు, పాతబడిన వస్తువుల్లో నీరు నిలబడకుండా‌ చేయాలని, మలేరియా, డెంగ్యూ వ్యాధులను ఆరంభంలోనే అరికట్టాలని, ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు దోమలపై యుద్దం చేద్దామని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పిలుపునివ్వటం జరిగినది.

ఎన్. నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here