రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిరుపేదలకు అండగా ఎల్లపుడు అందుబాటులో ఉంటాం: యంపి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
214

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సొంత ఖర్చుతో సుమారు 2100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించే విధంగా సామాజిక దూరం పాటిస్తూ, కంటైన్మెంట్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే విధంగా ఈరోజు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ నందు స్థానిక బస్తి కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, వాలంటీర్లకు మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కోవిడ్-19 కంటైన్మెంట్ ఏరియాను పరిశీలించి,నిత్యావసర వస్తువులు జి.హెచ్.ఎం.సి సిబ్బంది ద్వారా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ.రంజిత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారితో కలిసి అందించారు…

ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరుపేద ప్రజలకు తనవంతు సహాయంగా ముందుకు సాగుతున్న కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారిని అభినందించారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ.డాక్టర్.జి.రంజిత్ రెడ్డి గారు..

ఎం.పి గారు మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం,1500 రూపాయలు అందించడమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా 12కిలోల బియ్యంతో పాటు 500రూపాయలు అందించడం జరుగుతుందని, మేము కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు.

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని నిరుపేద ప్రజలకు గత 30రోజులుగా దాతల సహాయంతో మధ్యాహ్న భోజనము, నిత్యావసర వస్తువులు అందించడం జరిగుతుందని, ఇప్పటికే డివిజన్ పరిధిలో సుమారు 4500కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని, మునుముందు కూడా రేషన్ రాని నిరుపేదలకు గుర్తించి వారికి ఎదో ఒక రూపంలో సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ మరియు టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు ఖాసీం, వార్డ్ సభ్యులు రహీం, సదర లియకత్, షోయబ్, సలీం, బాబూమియా, మునఫ్ ఖాన్, మియాన్, అజీముల్లహ్ ఖాన్, మానిక్యప్ప, శంకర్ రావు, యూత్ అధ్యక్షులు మహమ్మద్ ఖాజా, ఇమ్రాన్, మూస, ఆర్షద్, రషీద్, హాజి, మహమ్మద్, ఫిరోజ్,
ఖమర్, షైక్ ఖాజా, మెరాజ్, పర్వీన్ బేగం, రంజిత్ అన్న యువసేన అధ్యక్షులు ఆశిల శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.