రేపు పేదలకు పంచనున్న నిత్యావసరాల సరుకుల కార్యక్రమానికి MLA అరెకపూడి గాంధీ గారిని ఆహ్వానించిన బొబ్బ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి, డైరెక్టర్, కార్పోరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
296

శేరిలింగంపల్లి, మే 10:
MLA గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలసిన బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ మెంబెర్స్.

పేదలకు పెద్దఎత్తున నిత్యావసరాల వస్తువులను అందచేస్తున్నందుకు అభినందననియం – MLA గాంధీ గారు

మానవసేవే – మాధవసేవ – బొబ్బ విజయ రెడ్డి, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్.

మన చందానగర్ – నా బాధ్యత – బొబ్బ నవత రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, డైరెక్టర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్.

చందానగర్ డివిజన్ లో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసే నిత్యావసరాల వస్తువుల గురించి MLA గాంధీ గారికి వివరించి రేపు 11.05.2020 సోమవారం ఉదయం 11 గంటలకు వేమన రెడ్డి కాలనీ రాముల వారి గుడి ఆవరణలో కార్యక్రమానికి హాజరు కావాలని కోరిన బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, డైరెక్టర్ మరియు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ మెంబెర్స్ మరియు కార్పొరేటర్ మాట్లాడుతూ కోవిడ్ -19 మూలంగా సుమారు 2 నెలల నుండి లాక్ డౌన్ అయిన సందర్భంలో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని, మా ప్రియతమ ముఖ్యమంత్రి KCR గారి ఆదేశాల మేరకు, మా అభిమాన నాయకుడు మంత్రివర్యులు KTR గారి సూచనల మేరకు మా ఎం.పి రంజిత్ రెడ్డి గారు మరియు MLA గాంధీ గారి స్ఫూర్తి తో పేద వారిని ఆదుకోవాలనే ఉద్దేశం తో మా కుటుంబ సభ్యుల యొక్క సహకారం తో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరియు కొంతమంది దాతల స్వచ్చంధ సహకారం తో మొత్తం 32 లక్షల విలువ గల నిత్యావసర సరకులను, 3200 పేదకుటుంభాలకు , ప్రతి కుటుంబానికి 27 నిత్యావసరాల సరకులు గల 18 కిలోల బరువు తో, సుమారు 1000 రూపాయల విలువ గల కిట్టును 11.05.2020 సోమవారం ఉదయం 11.00 గంటలకు వేమన రెడ్డి కాలనీ గుడి ఆవరణలో MLA మరియు MP గార్లచే ప్రారంభోత్సవం చేసి వారి చేతుల మీదుగా ట్రస్ట్ ద్వారా టోకన్లు పొందిన పేద కుటుంబాలకు అందచేయటం జరుగుతుంది అని, పేదలకు పెద్దఎత్తున నిత్యావసరాల వస్తువులను అందచేస్తున్నాoదుకు MLA గారు అభినందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ దామోదర్ రెడ్డి,శ్రీకాంత్,గౌస్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here