ఈరోజు వికారాబాద్ పట్టణంలోని వెంకటాపూర్ తండా, గరీబు నగర్ మరియు కోటపల్లి మండలంలోని నాగసానిపల్లి, కరీంపూర్, రాంపూర్, బార్వాద్ గ్రామాలలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో 2000 కుటుంబాలకు కూరగాయలు, గ్రుడ్లు, బిర్యానీ పాకెట్స్ ను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ గారు, కోటపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయా గ్రామాల సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.