పేదలను ఆదుకుంటున్న కార్పొరేటర్ జానకి రామ రాజు
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కార్పొరేటర్ జానకి రామ రాజు ఆదుకుంటున్నారు.శనివారం కే టీ ఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ పరిధిలోని శ్రీనివాస కాలనీ,ఇంద్ర నగర్ కు చెందిన 50 మంది పేద ప్రజలకు తన సొంత ఖర్చుతో బియ్యం,పప్పు, నూనె,కారం పొడి, సబ్బులు వంటి 15 రకాలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్ లో ఇప్పటికే 2950 నిత్యావసర సరుకుల కిట్లను అందజేయడం జరిగిందన్నారు. డివిజన్ లో కరోనా కట్టడికి కోవిడ్ -19 నిబంధనలను కఠినంగా అమలయ్యే విధంగా చూడడం జరుగుతుందన్నారు. కాలనీలలో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి శానిటేషన్ చేయడం జరుగుతుందన్నారు. బయటకు వెళ్ళేటప్పుడు భౌతిక దూరం తో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ విజయ, బోస్ రెడ్డి, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, తెరాస నాయకులు మురళీధరరావు, రంగనాథరాజు, భార్గవ్, రవికుమార్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.