లింగంపల్లి నుండి మూడు రైళ్లలో బయలుదేరిన వలస కూలీలు

0
236

లింగంపల్లి నుండి మూడు రైళ్లలో బయలుదేరిన వలస కూలీలు

లాక్ డౌన్ తో తిప్పలుపడుతున్న వలస కార్మికులు తమ సొంతూళ్ళకు బయలుదేరారు. అటు కన్ స్ట్ర క్షన్ కంపెనీలు జీతాలివ్వక ఇటు తిండికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలు ఎప్పుడెప్పుడు ఊరెళ్ళిపోదమా అని ఎదురుచూస్తున్న కూలీల ఆశలు ఎట్టకేలకు ఫలించాయి.
ప్రభుత్వం తమకు ఎప్పుడు అనుమతినిస్తుందోనని ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగిన కార్మికులు రైలుబండి ఎక్కారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి వలస కూలీలను స్పెషల్ ట్రైన్ లో పంపించారు.

చందానగర్, మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ లలోని
దాదాపు 3 వేల మంది వలస కూలీలు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి 3 ట్రైన్ లలో తెల్లవారుజామున వారి స్వస్థలాలకు బయలుదేరారు.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, వేజ్ బోర్డు చైర్మన్ సామ వెంకట రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్న, రైల్వే, పోలీసు అధికారులు కార్మికులను చప్పట్లతో సాగనంపారు.

వలస కూలీలకు స్క్రీన్ టెస్ట్ చేసి మాస్కులు అందజేశారు. భోజనాలు, వాటర్ బాటిల్స్ ను అధికారులు సమకూర్చారు.

బిహార్ రాష్ట్రం వెళ్ళేవారికి దర్బంగా రైలు, బాదల్ పూర్ రైలు, ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారికి బొలక్ పూర్ రైలును ఏర్పాటు చేశారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here