వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండ: శ్రీమతి యం లక్ష్మీ బాయి గారు కార్పొరేటర్

0
174

శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ వివేకానంద నగర్ లోని రిక్షాపుల్లర్స్ కాలనీ మరియు రామకృష్ణా నగర్ లలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడిన భాదితులకు *మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గార్ల* ఆదేశాలు మేరకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని *కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు మాధవరం రామారావు గారు* ప్రజలకు భరోసానిచ్చారు. నష్టపోయిన బాధిత కుటుంబాలకు, జీహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులు, స్థానిక నాయకులతో కలసి పదివేలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని *కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు శ్రీ మాధవరం రామారావు గారు గొట్టిముక్కుల పెద్ద బాస్కర్ రావు గారు,మొలుగు హీమగిరి రావు గారు, యం.రంగారావు గారు* అందజేశారు. ఈ సందర్బంగా *మాధవరం రామారావు గారు* మాట్లాడుతూ ముంపునకు‌ గురైన బాధితులకు ముఖ్యమంత్రి అందజేస్తున్న రూ. 10 వేలను అందజేయడం పట్ల వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయని అన్నారు. ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటూ అండదండలు అందజేస్తుందని తెలియజేసారు. అన్ని వేళల సహాయక చర్యలు తీసుకోవటానికి మన టి.ఆర్.ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులతో పాటు డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్ మరియు స్థానిక పెద్దలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief Telangana State
NAC NEWS CHANNEL
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here