వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

0
137

ముంపు బాధితులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నాడు
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
ముంపు బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. లింగంపల్లి గ్రామం, తారానగర్, సురభి కాలనీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులకు అందజేసిన రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బుధవారం అందజేశారు. ముంపునకు‌ గురైన బాధితులకు ముఖ్యమంత్రి అందజేస్తున్న రూ. 10 వేలను అందజేయడం పట్ల వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయని అన్నారు. ఆయన వెంట లింగంపల్లి లో డీఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ గౌరవాధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, సలీం, టీఆర్ఎస్ పార్టీ లింగంపల్లి గ్రామ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, తారానగర్ లో వార్డు మెంబర్ కవితాగోపీ, అధికారులు అనిల్, నాయకులు నట్ రాజ్, మైనార్టీ బస్తీ కమిటీ అధ్యక్షుడు సయ్యద్, సురభికాలనీలో టాక్స్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, కోదండరాం, సతీష్, వార్డు మెంబర్ శ్రీకళ, యువజన నాయకులు అనిరుద్ యాదవ్, రోజా, వజీర్ మోహన్ తదితరులు ఉన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief Telangana State
NAC NEWS CHANNEL
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here