వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం
చందానగర్ డివిజన్ లో రూ.10 వేలు తక్షణ సాయం అందజేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్టీ..
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. ఈ మేరకు భవాని పురం బస్తి,వేముకుంట,హరిజన్ బస్తి,శివాజీ నగర్ బస్తి, లలో ఈరోజు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్టీ పర్యటించి నీట మునిగిన ఇంటింటికీ ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం వరద బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వరద బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తక్షణ సహాయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించడం సంతోషకరమని, వరదల వల్ల ఇళ్లలోకి నీరు రావడం, ఆస్తి నష్టం జరగడం, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
Nalla Sanjeeva Reddy
Bureau Chief Telangana State
NAC NEWS CHANNEL
9866318658