శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: హఫీజ్ పెట్ డివిజన్ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉంటామని అన్నారు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సూచనల మేరకు హైదరాబాద, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వరద బాధిత ప్రాంతాల్లోని ఒక్కో కుటుంబనికి రు.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో భాగంగా ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా ముఖ్యమంత్రి శ్రీ.కే.చంద్రశేఖర్ రావు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ మరియు మదినగూడాలో ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి, ముంపు ప్రభావానికి గురైన పలు కుటుంబాలను కలిసి, వారితో మాట్లాడి, తక్షణ సాయంగా ప్రభుత్వం తరపున పదివేల రూపాయల నగదును జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి అందించారు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.