వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్న ప్రజలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది: కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు మాధవరం రామారావు గారు

0
151

శేరిలింగంపల్లి, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ వివేకానంద నగర్ లోని రిక్షాపుల్లర్స్ కాలనీ మరియు రామకృష్ణా నగర్ లలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడిన భాదితులకు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీ నవీన్ రావు గార్ల ఆదేశాలు మేరకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు మాధవరం రామారావు గారు ప్రజలకు భరోసానిచ్చారు. నష్టపోయిన బాధిత కుటుంబాలకు, జీహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులు, స్థానిక నాయకులతో కలసి పదివేలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు శ్రీ మాధవరం రామారావు గారు గొట్టిముక్కుల పెద్ద బాస్కర్ రావు గారు అందజేశారు. ఈ సందర్బంగా *మాధవరం రామారావు గారు మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటూ అండదండలు అందజేస్తుందని తెలియజేసారు. అన్ని వేళల సహాయక చర్యలు తీసుకోవటానికి మన టి.ఆర్.ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులతో పాటు డివిజన్ అద్యక్షులు సంజీవ్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ వెంకటస్వామి సాగర్, పర్వత సతీష్,రేణుక సీనియర్ నాయకులు యం.రంగారావు, కొమ్మగళ్ళ మోజెస్,బాబు రావు,గిరిబాబు, సాలయ్య, జీడి విక్రం, క్రాంతి కుమార్,శ్రీను, ఎన్.రాము, స్థానిక నాయకులు దేవదాసు, సురేష్,సాయిబాబ, రాధాబాయి, భారతమ్మ, రవి, ప్రభాకర్, నారాయణ, నవీన్, సాం, సాయి, యాదగిరి, మల్లేష్, రాజు, శేఖర్, శ్రీనివాస్, కార్తీక్ మరియు స్థానిక పెద్దలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here