వారంలో ఆదివారం 10 నిమిషాలు డ్రైడే కోసం కేటాయించండి కార్పొరేటర్ జానకి రామ రాజు గారు

0
160

శేరిలింగంపల్లి, August 02: మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ లో ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పాల్గొన్నారు. కాలనీలో దోమల నివారణ కోసం వాటర్ ట్యాంకులలో లార్వా నిర్మూలన కోసం Temephos Chemical మందును కలిపారు. పరిసరాలతో దోమల నివారణ కోసం (Alphacypermetrin powder Chemical) దోమల నివారణ మందులను జిహెచ్ఎంసి ఎంట మాలజీ సిబ్బంది చేత స్ప్రే చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రతి ఆదివారం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జానకి రామ రాజు గారు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో సీజనల్ వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. హెచ్ఎంటి హిల్స్ లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం జిహెచ్ఎంసి సిబ్బంది తో ఇంటింటా జానకి రామ రాజు గారు కలియ తిరిగారు. ప్రతి ఇళ్లు, ప్రతి ఇంటితో పాటు పరిసరాల్లోని పూల కుండీల్లో నిండిన నీటిని తొలగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గన్యా లాంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని.. ఇందుకు కారణమైన దోమలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయిస్తే వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంట మాలజీ సూపర్వైజర్ నరసింహ టిఆర్ఎస్ నాయకులు రంగనాథ రాజు, గోవింద్, రామారావు, హెచ్ఎంటి హిల్స్ సొసైటీ జనరల్ సెక్రటరీ మున్నయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here