వివేకానందనగర్ డివిజన్ లో కార్పోరేటర్ శ్రీమతి యం లక్ష్మీ బాయి గారి పర్యటన.

0
192

శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానందనగర్ డివిజన్ లోని వెంకటేశ్వర నగర్ 33 బ్లాక్ లో జి.హెచ్.ఎం.సి సిబ్బంది తో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి యం.లక్ష్మీబాయి గారు పరిశుభ్రత – పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి, పలు సమస్యలపై పర్యటించారు. కురిసిన వర్షానికి నాలాలో మట్టి,చెత్త పేరుకపోవడం తో జీహెచ్ఏంసి మాన్సూన్ టీం తో క్లీనింగ్ చేయించడం జరిగింది. వర్షం నీరు నిల్వ ఉండకుండా పూడికను తొలగించి నిర్మాణం కోసం సంబంధించిన ఎస్టిమేషన్ ను సిద్ధం చేయమని నాలా విస్తీర్ణ పనులు మొదలుపెట్టాలని నాలాపై కవర్లు విరగడం తో వాటిని కొత్తవి ఏర్పాటు చేయాలనీ అధికారులకు సూచించారు. అలాగే నీళ్ళు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు ఉత్పత్తి కాకుండా దోమల మందు పిచకారి చేయమని అధికారులను కోరారు. రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాదులు ప్రభలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కార్పొరేటర్ శ్రీమతి యం.లక్ష్మీబాయి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి అధికారులు ఏ.ఈ హేమునాయక్ గారు, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, ఎస్.ఎఫ్.ఏ తులసిదాస్, పారిశుధ్య కార్మికులు మరియు వార్డ్ మెంబర్ సబ్యులు వెంకటస్వామిసాగర్ ఏరియా కమిటీ సబ్యులు డాన్ వెంకట్ స్థానిక పెద్దలు మరియు ముఖ్యనాయకులు హరినాథ్,నారాయణ,బ్రమ్మచారి,ప్రసాద్,మల్లికార్జున్,హనుమంత్ రెడ్డి,తిరుపతి,నర్సింలు,సునిత, లక్ష్మీ,సరస్వతి మరియు తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here