వివేకానంద నగర్ లోని వెంకటేశ్వరనగర్, రిక్షాపుల్లర్స్ కాలనీ, రామకృష్ణా నగర్ మరియు హనుమాన్ నగర్ లలో వరద బాధితులకు ఆర్ధిక సాయం

0
295

శేరిలింగంపల్లి, అక్టోబర్ 28: శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ వివేకానంద నగర్ లోని వెంకటేశ్వరనగర్, రిక్షాపుల్లర్స్ కాలనీ, రామకృష్ణా నగర్ మరియు హనుమాన్ నగర్ లలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడిన భాదితులకు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గార్ల ఆదేశాలు మేరకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు మాధవరం రామారావు గారు ప్రజలకు భరోసానిచ్చారు. నష్టపోయిన బాధిత కుటుంబాలకు, జీహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులు, స్థానిక నాయకులతో కలసి పదివేలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి గారు మరియు శ్రీ మాధవరం రామారావు గారు గొట్టిముక్కుల పెద్ద బాస్కర్ రావు గారు, యం.రంగారావు గారు అందజేశారు.

ఈ సందర్బంగా మాధవరం రామారావు గారు మాట్లాడుతూ… ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటూ అండదండలు అందజేస్తుందని తెలియజేసారు. అన్ని వేళల సహాయక చర్యలు తీసుకోవటానికి మన టి.ఆర్.ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్ ప్రశాంతి గారు, జీహెచ్ఎంసి సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులతో పాటు డివిజన్ అద్యక్షులు సంజీవ్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్ మరియు స్థానిక పెద్దలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here