వీధి దీపాలను ఏర్పాటు చేయించిన కార్పోరేటర్ జానకి రామ రాజు గారు.

0
346

Serilingampally, June 05: రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పేర్కొన్నారు. కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ పరిధిలోని తులసి నగర్ చౌరస్తా, శ్రీనివాస కాలనీ లో నూతనంగా విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం టి ఆర్ ఎస్ నాయకులు కార్పొరేటర్ జానకి రామ రాజు గారిని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా జానకి రామ రాజు గారు మాట్లాడుతూ… ప్రజలకు, వాహనదారులకు రాత్రివేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికే విద్యుత్ వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాలనీవాసులు ఎక్కడైనా వీధి దీపాలు పాడైతే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని తొలగించి నూతనంగా కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. విద్యుత్ అధికారులు నిరంతరం ఇలాంటి వాటిపై పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్స్ చిందం శ్రీకాంత్,విజయ, భరత్ ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక ,సదా మాధవి, అరుంధతి ,డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, తెరాస నాయకులు మురళీధర్ రావు, రంగనాథ రాజు, శ్రీనివాసరాజు,మహేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,యోగేశ్వర్ రెడ్డి, సుబ్బారావు విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here