వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు10శాతం గ్రాస్ సాలరీ పెంచడం హర్షనీయం:రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి

0
280

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు 10శాతం గ్రాస్ సాలరీ పెంచడం హర్షణీయం:
H1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కర్నాటి సాయిరెడ్డి
————————————-
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి విస్తరించండం వల్ల దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో తమ ఆరోగ్యాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు
10% శాతం వేతనాలు పెంచడం పట్ల తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హేల్త్ ఎంప్లైస్ యూనియన్ – హేచ్ 1, రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కర్నాటి సాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారా మెడికల్ సిబ్బందికి రూ.10000/- రూపాయలు మరియు ఆశావర్కర్లకు రూ. 7500/- రూపాయలను పారితోషికంగా ఇవ్వాలని కోరారు. ఈ అంశం తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు గ్రాస్ సాలరీలో 10 శాతం ఇవ్వడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పెర్కోన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యూనియన్, జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రవిశంకర్ , వర్కింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కత్తి జనార్థన్ , ట్రెజరర్ డాక్టర్ కృష్ణారావు , కో ఛైర్మన్ సుదర్శన్ , కో కన్వీనర్‌ ఎస్ రమేష్ పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

Telangana
నల్లా సంజీవ రెడ్డి బ్యూరో చీఫ్ సౌత్ ఇండియా ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here