శేరిలింగంపల్లిలో ఉద్యమానికి ఊపిరి పోసిన దివంగత నాయకుడు కొండకల్ శంకర్ గౌడ్ 51వ జయంతి సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం చేసిన:తెరాస నాయకులు రవీందర్ యాదవ్.

0
278

శేరిలింగంపల్లి NAC న్యూస్ మే 9: అనాధ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి తెలంగాణ రాష్ట సమితి నియోజకవర్గ మాజి ఇంచార్జ్ దివంగత కొండకల్ శంకర్ గౌడ్ 51వ జయంతి పురస్కరించుకొని, వారి జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థం కోసం మియాపూర్ లో గల వివేకానంద సేవ సంఘం అనాధ ఆశ్రమంలో… రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో వృద్దులకు చిన్న పిల్లలకు అన్నదాన కారిక్రమం నిర్వహించాడం జరిగింది.

ఈ నేపథ్యంలో రవీందర్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి, అలసట లేకుండా పోరాటం చేసిన నాయకుడు దివంగత కొండకల్ శంకర్ గౌడ్, గారు అని ఆనాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా చందానగర్ లో దదాపు 400 రోజులు పైన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు, అదేవిధంగా వంటావార్పు, మానవహారం లాంటి కార్యక్రమాలు చేసి శేరిలింగంపల్లి ప్రజల మనసుల్లో ఒక దేవుడిలా నిలిచిపోయాడు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు తెలంగాణ రాష్ట్రం చింతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పేదల ఆకలి తీర్చడం లో ఎంతో సంతోషం ఉందని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. అనాధ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన రవిందర్ యాదవ్ కు ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు రవీందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, లోక్ బండారి, తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here