శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్

0
304

డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా:కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.

శేరిలింగంపల్లి డివిజన్‌ను‌ అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా‌ కృషి‌ చేస్తున్నానని, ఎవరికి‌ ఏ చిన్న సమస్య వచ్చిన‌ తన దృష్టికి తీసుకువస్తే‌ అప్పటికప్పుడు‌ సమస్య శాశ్వత పరిష్కారానికి పాటుపడుతున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని దూబేకాలనీలో‌ అసోసియేషన్ సభ్యులతో కలిసి‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీలో‌‌ జరుగుతున్న యూజీడీ పనులను పరిశీలించారు. వెంకటేశ్వర కాలనీ తో పాటు‌ చుట్టు పక్కల కాలనీల నుంచి‌ వచ్చే డ్రైనేజీ‌‌ నీరు,‌వర్షపు‌ నీటి ప్రవాహంతో ఇన్నాళ్లు‌ దూబే కాలనీ వాసులు నరకయాతన అనుభవించారని‌ ఇక నుంచి అలాంటి‌ సమస్య ఉండబోదని యూజీడీ నిర్మాణంతో శాశ్వత సమస్య తీరనుందన్నారు. దూబే కాలనీలో ఇంటింటికి మంజీరా నీటి కనెక్షన్, సీసీ రోడ్లు, యూజీడీ తదితర పనులను పూర్తి స్థాయిలో చేశామని అక్కడక్కడా నెలకొని ఉన్న చిన్న‌చిన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామినిచ్చారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్ గా రాగం నాగేందర్ యాదవ్ గారు గెలిచినప్పటి నుంచి మా కాలనీలో నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయని, కార్పొరేటర్ సహకారంతో కాలనీని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. కార్పొరేటర్ చేస్తున్న కృషిని కాలనీవాసులందరం ఎప్పటికి మరిచిపోలేమన్నారు. అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here