శేరిలింగంపల్లి డివిజన్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తులా కృషి చేస్తా: రాగం నాగేందర్ యాదవ్ కార్పోరేటర్

0
381

శేరిలింగంపల్లి డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడుతున్నామని ఏ సమస్య ఉన్నా ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే అప్పటికప్పుడు పరిష్కరించనున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గోపీనగర్ లో స్థానికులతో కలిసి పర్యటించారు. మంజీరా నీటి సరఫరా సక్రమంగా రావడం‌ లేదని, కొన్ని కాలనీల్లో సగం‌ వరకే మంచినీటి సరఫరా పైపులైన్, యూజీడీ పైపులైన్ పనులను‌ వేసి నిలిపివేశారని ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. నెలన్నర రోజులు‌ మూడు రోజులకోసారి‌ నిరంతరాయంగా గంటన్నర పాటు మంచి నీటి సరఫరా చేయనున్నట్లు ఆ తర్వాత నీటి సమస్య అసలే ఉండదన్నారు. మంచినీటి పైపులైన్ పనులను, యూజీడీ పైపులైన్ పనులను త్వరలోనే వేయించి శాశ్వత సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. ఈ పనులు పూర్తి కాగానే సీసీ రోడ్లు వేయించనున్నట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆయన వెంట వాటర్ వర్క్స్ ఏరియా మేనేజర్ వెంకట్ రెడ్డి, సూపర్ వైజర్ ప్రవీణ్ కుమార్, కాలనీ వాసులు మూర్తి, సుభాష్, వెంకట్, ఆంజనేయులు, టి.‌నర్సింలు, కమలమ్మ, శ్రీనివాస్, రవి, కిష్టయ్య, భరత్ రావు, ప్రభాకర్, గోపాల్ యాదవ్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు‌ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here