శేరిలింగంపల్లి డివిజన్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ స్థానిక కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలసి శంకుస్థాపనలు.

0
151

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్, గోపీనగర్, నెహ్రూ నగర్ లలో రూ. 3 కోట్ల 65 లక్షల నిధుల వ్యయంతో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శాసన సభ్యులు అరికపూడి గాంధీ గురువారం శంకుస్థాపనలు చేశారు. పాపిరెడ్డి కాలనీలో రూ. 95 లక్షల నిధులతో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ ఏర్పాటు చేయడంతో 90 శాతం పనులు పూర్తయినట్లని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. వంద శాతం అభివృద్ధిని త్వరలోనే చూస్తారని చెప్పారు. రోడ్ల పక్కన ఎవరైనా భవన శిథిలాలను వేస్తే రూ. 50 వేల జరిమానా తప్పదని హెచ్చరించారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా వ్యవహరించి శిథిలాలను వేసే వాహనం ఫోటో తీసిన వారికి రూ. 500 ప్రోత్సాహక బహుమతిని అందజేయనున్నట్లు చెప్పారు.
ప్రధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించనున్న దృష్ట్యా పరిశుభ్రత పాటించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, భౌతిక దూరం పాటించి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాస్క్ లు, సానిటైజర్ తప్పకుండా వాడాలని సూచించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటున్నామని దాదాపు పాపిరెడ్డి కాలనీ, గోపీనగర్, నెహ్రూ నగర్ లో యూజీడీ, సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహకారంతో డివిజన్ ను త్వరలోనే వంద శాతం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామ‌ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్, టీఆర్ఎస్ పార్డీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కుంచం రమేష్, వేణుగోపాల్ రెడ్డి, పద్మారావు, మేకల కృష్ణ యాదవ్, యాదాగౌడ్, వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, శ్రీకళ, ఫర్వీన్ తో పాటు పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, 24×7 యూత్ అధ్యక్షుడు బాలు నాయక్, నవయగ యూత్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, నెహ్రూ నగర్,‌బాపునగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్, రాజు , మైనార్టీ కమిటీ అధ్యక్షుడు గఫూర్, యువజన‌ విభాగం అధ్యక్షుడు మహేందర్ సింగ్, నాయకులు రవి యాదవ్, కెఎన్ రాములు, రాజేశ్వరమ్మ,లింగారెడ్డి, లింగం శ్రీనివాస్, నర్సింహా గౌడ్, ప్రభాకర్ గౌడ్, వసంత, చంద్రకళ, రజిని, రోజా, ముంతాజ్, సుజాత, మహేష్ ముదిరాజ్, సలీం, ఖాదర్, శ్యాం, వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here