శేరిలింగంపల్లి నియోజక వర్గం కురుమ సంఘం అధ్యక్షులు శ్రీ సూర్న శ్రీశైలం మరియు కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల వితరణ:

0
201

కరోనా మహమ్మారి ప్రబలిన విపత్కర పరిస్థితు లల్లో లాక్ డౌన్ సందర్భంగా ఈరోజు అంబేద్కర్ నగర్ మియాపూర్ నందు గల తన గృహ సముదాయం ఆవరణ లో శ్రీ సూర్న శ్రీశైలం, కురుమ సంఘం, శేరిలింగంపల్లి నియోజక వర్గం అధ్యక్షులు తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నిరుపేదలకు మరియు మున్సిపల్ కార్మికులకు తమ వంతు సహాయంగా వంద మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది.

ఈ యొక్క సేవా కార్యక్రమంలో మా మిత్రులు ప్రజయసిటీ నివాసి M.వెంకటేష్, ప్రజయ్ సిటీ కేబుల్ రవి గౌడ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, ప్రభు ముదిరాజ్, కుమారులు భాస్కర్, శ్రావణకుమార్ వాచ్మెన్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.