శేరిలింగంల్లి నియోజకవర్గo చేర్యాల మండల కురుమ సంఘం అధ్యక్షులు శ్రీశైలం గారి సహకారంతో గొర్రెల కాపరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆకునూర్ కురుమ సంఘం నాయకులు

0
228

శేరిలింగంల్లి, May 3: చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామంలో కురుమ కులానికి చెందిన 20 మంది గొర్రెల కాపరుల కుటుంబాలకు కురుమ సంఘం రాష్ట్ర నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సూర్న శ్రీశైలం గారి సహకారంతో కామల్ల రాజు, అందె అశోక్ చేతుల మీదుగా ఆదివారం రోజున బీరప్ప గుడి వద్ద బియ్యం, 3 రకాల కూరగాయలు, నూనె, పప్పు పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్ చేర్, నారాయణఖేడ్, సంగారెడ్డి, పలు జిల్లాల్లో పంపిణీ చేస్తూ స్వంత చేర్యాల మండలమైన ఆకునూర్ గ్రామంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా గొర్రెల అమ్మకాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతున్న ఇలాంటి సందర్భంలో ఉన్నంతగా తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ శిగుల్ల బీరయ్య, శిగుల్ల బాలరాజు, శిగుల్ల రమేష్, సూర ఓజల్, శిగుల్ల నరేష్, అమరగొండ మల్లయ్య, శిగుల్ల నాగరాజు, ఇరుమల్ల సంపత్, శిగుల్ల శ్రీనివాస్, బోడపట్ల బాలయ్య, సూర నర్సయ్య, మాధ చంద్రయ్య, కడారి యాదయ్య, శవల్ల రాజయ్య, కడారి రామస్వామి, కడారి సత్తయ్య, అమరగొండ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here