శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్:హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం.

0
292

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం..
శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజ సమస్యను కాలనీ వాసులు స్థానిక కార్పోరేటర్ గారి దృష్టికి తీసుకురాగా ఈరోజు హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి జనరల్ మేనేజర్ శ్రీ.రాజశేఖర్ గారు,డి.జి.ఎం.శ్రీమతి.శ్రీ.నాగప్రియ గారు,మాధాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు,స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు హఫీజ్ పేట్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి.శ్రీ.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.KTR గారు ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటూనే,మరో వైపు అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని,హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి,బంగారు బాబు,శ్రీనివాస్ రెడ్డి,మోహన్ రెడ్డి మరియు ఇతర కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here