రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది..
శ్రీమతి.శ్రీ..వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..
దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు.. ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ నందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది వలస కూలీలకు మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉంటూ మియాపూర్,అల్విన్ క్రాస్ రోడ్డు,హఫీజ్ పేట్,కొండాపూర్ ప్రాంతాల్లో రోజు ఆటోలు నడిపే 50మంది ఆటో కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు..అనంతరం ఆర్.టి.సి కాలనీ అసోసియేషన్ మరియు శ్రీ అభయ ఆంజనేయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది నీరుపేద ప్రజలకు భోజనాలు అందించేందుకు సిద్ధం చేస్తున్న వంట పనులను కార్పొరేటర్లు పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు..
కార్పొరేటర్లు మాట్లాడుతూ.. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని,బయటకి వచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసారు..ఈ కార్యక్రమంలో మనోహర్ గౌడ్,చంద్ర శేఖర్,రమేష్ గౌడ్,సురేష్,సాయినాథ్,మెయిన్,ఆర్షద్
తదితరులు పాల్గొన్నారు…
Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.