సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్ జానకి రామ రాజు

0
237

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కె. టి. ఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ పరిధిలో ని శ్రీనివాస కాలనీ, తులసి నగర్ లో 60 మంది పేద ప్రజలకు వారి ఇంటి వద్దనే సామాజిక దూరం పాటిస్తూ 15 రకలతో కూడిన నిత్యవసర సరుకుల కిట్స్ ను మంగళవారం స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కష్ట సమయంలో పేద ప్రజలకు సేవచేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. డివిజన్ లో ఇప్పటికే 2800 నిత్యవసర కీట్స్ ను పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎవరు కూడా ఆకలితో అలమటించ కుండా చూసుకునే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి కట్టడికి సామాజిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు ధరించడం శ్రీరామరక్ష అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ విజయ, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య ,రేణుక, డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, తెరాస నాయకులు మురళీధరరావు, రంగనాథరాజు,రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్