శేరిలింగంపల్లి, మే 14: కరోనా వైరస్ వల్ల రోజువారీ కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్న వారికి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, సామాజిక బాధ్యతగా ఎంతో మంది ముందుకు వచ్చి నిత్యం ఏదో ఒక రూపంలో నిత్యావసర వస్తువులు మరియు భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు మాధాపూర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు మాధాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ కాలనీలో సుమారు 150 మంది నిరుపేదలకు కార్పోరేటర్ గారు నిత్యావసర సరుకులను స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు అందచేశారు…
ఈ కార్యక్రమంలో ఏ.బాలరాజు, సాంబశివరావు, రెహ్మాన్, ముఖ్తార్, రామకృష్ణ, సత్యనారాయణ, రాములు, బుజన్న, శివ గౌడ్, నళిని తదితరులు పాల్గొన్నారు..
ఎన్ నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.