సామాజిక భాద్యతగా పిలుపునిచ్చిన నేపద్యంలో దాతలు ఇలాంటి కష్టకాలంలో ముందుకు వచ్చి నిరుపేదలకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
159

Serilingampally, May 3: కరోనా వైరస్ లాక్ డౌన్ నేపద్యంలో ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు,కూరగాయలు అందించడం జరుగుతుందని, పేద ప్రజల ఆకలి తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్, బిక్షపతి నగర్, దీప్తి హిల్స్ నందు దాతలు వారి సొంత ఖర్చులతో నిరుపేదలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు అందించారు..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని 150 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను కార్పొరేటర్ గారి సొంత ఖర్చుతో నిరుపేదలకు చేరే విధంగా ఈరోజు కార్యకర్తలకు అందించారు.

1. వైశాలి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బంగారు బాబు, ప్రసాద్ రెడ్డి, మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 150 మంది నిరుపేదలకు, ఇతర రాష్ట్రాల వలస కూలీలకు నిత్యావసర సరుకుల అందించారు.
2. మాదాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తి హిల్స్ నందు నివసిస్తునటువంటి సుమారు 70 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఎన్.ఎస్.కే బ్లిస్స్ ల్యాండ్ అపార్ట్మెంట్ వాసులు శ్రీ.చంద్రశేఖర్, విజయ్, శ్రీనివాస్, అర్జున్ వారి సొంత ఖర్చులతో నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేసి నిరుపేదలకు అందించడం జరిగింది.
3. బిక్షపతి నగర్ స్థానిక బస్తీ నాయకులు మహేష్ మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో బస్తీలో నివసిస్తునటువంటి సుమారు 250 మంది నిరుపేదలు, ఇతర రాష్ట్రాల ప్రజలకు నిత్యావసర వస్తువుల మరియు కూరగాయలు కార్పొరేటర్ శ్రీ వి.జగదీశ్వర్ గౌడ్ గారి చేతుల మీదుగా ప్రజలకు అందించారు..

ఈ కార్యక్రమంలో ప్రసాద్, ముఖ్తర్, రామకృష్ణ, చోటేమియా, నయిమ్, శ్రీనివాస్, శంకర్, మొగులమ్మ, నళిని, శ్రీజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.