సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత చర్యలు తీసుకున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

0
213

శేరిలింగంపల్లి, కొండాపూర్, May 28: రాబోయే వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాలు, సూచనల మేరకు, జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు ఈ రోజు కొండాపూర్ డివిజన్ లోని జనార్దన్ హిల్స్ లోని ఓపెన్ నాలా క్లియరెన్స్ పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు. రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలగకుండా ముందుస్తుగా పారిశుధ్య పనులను యుద్ధ ప్రాదిపదికన చేయిస్తున్నటుగా కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు తెలియజేశారు.

హమీద్ పటేల్ గారితో బాటుగా ఏరియా కమిటీ మెంబర్ కరీం, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here