సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ హమీద్ పటేల్

0
311

సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు.

శేరిలింగంపల్లి June 7 Nac: కొండాపూర్ : మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి ఆదేశాలు మేరకు ‘ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు – పది వారాల పాటు దోమల ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు ఈ రోజు పత్రిక నగర్ లోని నిర్వహించుట జరిగింది.

ఈ సందర్బంగా కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు మాట్లాడుతూ.. హాస్టల్స్ మరియు ఇళ్లల్లో దోమల వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని స్థానికులను కోరారు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, సీజనల్ వ్యాధులకు గురి కాకుండా, ఇంట్లోనూ, పరిసరాలలోనూ ఎక్కడ కూడా నిలువ నీరు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దోమలు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రస్తుత సమయంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూ, అవగాహనతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.

కార్పొరేటర్ హమీద్ పటేల్ గారితో బాటుగా వార్డు మెంబర్ రాజు యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ కుమ్మరి శ్రీనివాస్, యూత్ నాయకులు దీపక్, ఏఎంహెచ్ ఓ రంజిత్ రెడ్డి, ఏంటోమోలోజి డీఈ కిరణ్ రెడ్డి, ఏంటోమోలోజి సూపర్ వైజర్ సత్తార్, ఎసార్పి కిరణ్ మరియు జీహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here